logo

సామాజిక విలువలు పెంపొందించడంలో బ్రాహ్మణులు కీలకం: మంత్రి

బ్రాహ్మణ సంఘాల ఐక్యతతో ఆవిష్కరణలు జరిపినప్పుడే మన సంస్కృతి విలువలు పెరుగుతాయని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 22 Mar 2023 04:16 IST

సూర్యాపేటలో పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, బ్రాహ్మణ సంఘ నాయకులు

సూర్యాపేట అర్బన్‌, న్యూస్‌టుడే: బ్రాహ్మణ సంఘాల ఐక్యతతో ఆవిష్కరణలు జరిపినప్పుడే మన సంస్కృతి విలువలు పెరుగుతాయని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన కొనసాగుతోందన్నారు. విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే బ్రాహ్మణ పిల్లల చదువులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. సమాజం సామాజిక విలువలతో నడవడానికి బ్రాహ్మణుల పాత్ర కీలకమన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చాక దేశంలో ఆకలి చావులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. దేశంలో 35 శాతం మంది ప్రజలు ఒక పూట భోజనం చేస్తూ అర్ధాకలితో అలమట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆహార సూచీలో భారతదేశం 116వ స్థానానికి చేరి బంగ్లాదేశ్‌ కంటే దిగజారిపోయిందని విమర్శించారు. అంతకుముందు పంచాంగాన్ని ఆవిష్కరించి బ్రాహ్మణులకు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఆదుర్తి రామయ్య, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నంబొట్ల ఫణికుమార్‌ శర్మ, ఉపాధ్యక్షుడు దౌలతాబాద్‌ వాసుదేవశర్మ, వైదిక బ్రాహ్మణ పురోహిత సంఘం కార్యదర్శి యల్లంబట్ల రమేష్‌శర్మ, జూనూతుల సుబ్రహ్మణ్య శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని