మెరుగైన ర్యాంకు కోసం..!
విభిన్న కోర్సులు, నాణ్యమైన విద్యా బోధన, అన్ని వసతులు, పచ్చదనం.. ఆహ్లాదకరమైన వాతావరణంతో నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయిలో ప్రత్యేకతను చాటుతోంది.
త్వరలో ఎంజీయూలో న్యాక్ బృందం పర్యటన
నల్గొండ టౌన్, న్యూస్‌టుడే
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
విభిన్న కోర్సులు, నాణ్యమైన విద్యా బోధన, అన్ని వసతులు, పచ్చదనం.. ఆహ్లాదకరమైన వాతావరణంతో నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయిలో ప్రత్యేకతను చాటుతోంది. 2007లో నల్గొండ పరిధిలోని అన్నెపర్తి వద్ద ఏర్పాటైన ఈ వర్సిటీ అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తూ వస్తోంది. వర్సిటీలో చదివేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 22 కోర్సుల్లో సుమారు 1800 వందల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బి గ్రేడ్ గుర్తింపుతో కొనసాగుతున్న విశ్వవిద్యాలయం.. న్యాక్ మెరుగైన ర్యాంకు కోసం తపిస్తోంది. త్వరలో వర్సిటీకి న్యాక్ బృందం రానుంది.
ఎంజీయూలో యాంఫి థియేటర్
కోర్సులు ఇవే..
ఎంకాం, ఎంబీఏ జనరల్, ఎంబీఏ టూరిజం, ఐఎంబీఏ, బీటెక్ సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఎంసీఏ, ఎంఏ ఆంగ్లం, ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, టూరిజం, ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ గణితం, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ బాటని, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, ఎంపీసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివిధ సబ్జెక్టులో 60 మంది విద్యార్థులు ఆయా అధ్యాపకుల వద్ద పీహెచ్‌డీ పరిశోధనలు సైతం చేస్తున్నారు.
స్పోర్ట్స్ కాంప్లెక్స్
అభివృద్ధి కార్యక్రమాలు
* స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంజినీరింగ్ కళాశాల భవనం, యాంపి థియేటర్, పరీక్షల నియంత్రణ కార్యాలయ భవనం, ఉపకులపతి, అధ్యాపకుల నివాసాలు నిర్మాణాలు పూర్తి.
* సైన్స్ కళాశాల, ఆర్ట్స్ కళాశాలలో లిప్ట్‌లు, పార్కింగ్ షెడ్డులు ఏర్పాటు.
* ఆర్ట్స్ కళాశాల భవనంపై రూ.50 లక్షలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు.
* బాలురు, బాలికల అదనపు వసతి గృహాల భవనాల నిర్మాణం.
సౌర విద్యుత్తు కేంద్రం
600 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన
ఈ విద్యా సంవత్సరం వర్సిటీలో ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో సుమారు 50కి పైగా వివిధ కంపెనీలతో ఉద్యోగ మేళాలు నిర్వహించి సుమారు 600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎంపికైన విద్యార్థులు ఐటీ, ఫార్మా, బ్యాంక్స్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందారు.
ప్రయోగశాల
50 వేల పుస్తకాలతో గ్రంథాలయం
ఎంజీయూలో అతిపెద్ద గ్రంథాలయం అందుబాటులో ఉంది. సుమారు 50 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం అకడమిక్ అంశాలకు సంబంధించిన పుస్తకాలే కాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. గ్రంథాలయం మొత్తం డిజిటలైజ్‌డ్ చేశారు. ఏ పుస్తకం కావాలన్నా కంప్యూటర్‌లో చిటికెలో వెదుక్కునే అవకాశం ఉంది.
మెరుగైన ర్యాంకు ఆశిస్తున్నాం
- ఆచార్య గోపాల్‌రెడ్డి, ఎంజీయూ వీసీ
ప్రస్తుతం వర్సిటీ బి గ్రేడ్‌తో కొనసాగుతోంది. ఈ గ్రేడ్ మెరుగుపర్చుకోవడం కోసం ఎంతో కృషి చేస్తున్నాం. త్వరలో వర్సిటీలో న్యాక్ బృందం సందర్శించనుంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. వర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం నుంచి నిధులేమి రాకున్నా వర్సిటీ అంతర్గత నిధులతోనే అభివృద్ధి చేస్తూ వస్తున్నాం.
వర్సిటీలో సౌకర్యాలు మెరుగయ్యాయి
- ప్రియాంక, బీటెక్ ఫైనల్ ఇయర్
గతంలో వర్సిటీలో సమస్యలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం తక్కువగా సమస్యలున్నాయి. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు ఉండడంతో మాకు ఇబ్బందులు లేకుండా అయింది. హాస్టల్‌లో వసతులు మంచిగానే ఉన్నాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంతో విద్యార్థులకు ఆటలపై ఆసక్తి పెరిగింది. ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల అమలు బాగుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
India News
Pankaja Munde: నేను భాజపా వ్యక్తినే.. కానీ, పార్టీ నాది కాదు!
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
Movies News
Rana Daggubati: అప్పుడు పెద్ద సవాలు ఎదుర్కొన్నా.. అందుకే నటుణ్ని అయ్యా: రానా