logo

యాదాద్రిలో సంప్రదాయంగా నిత్యారాధనలు

శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారికి గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పూజలు నిర్వహించారు. సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపే పర్వాన్ని జరిపి ఆస్థానపరంగా, భక్తుల ఆర్జిత ఆరాధనలను కొనసాగించారు.

Published : 24 Mar 2023 04:44 IST

గజవాహనోత్సవం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారికి గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పూజలు నిర్వహించారు. సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపే పర్వాన్ని జరిపి ఆస్థానపరంగా, భక్తుల ఆర్జిత ఆరాధనలను కొనసాగించారు. గర్భగుడిలో స్వయంభువులకు అభిషేకం, అర్చన చేపట్టారు. కొత్త సంవత్సరం ఉగాది పండుగ తర్వాత చేపట్టిన నిత్యపూజలు ఆలయ ఆచారంగా విశేషంగా నిర్వహించిన పూజారులు భక్తజనులకు పంచనారసింహుల ఆశీస్సులను అందజేశారు. స్వర్ణ పుష్పార్చన, అష్టోత్తరం కైంకర్యాలు కొనసాగాయి. అష్టభుజి మండపంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామి లక్ష్మీ సమేతుడై గజ వాహన సేవోత్సవం పొందారు. మధ్యాహ్నం నివేదన జరిపారు. సాయంత్రం అలంకార సేవోత్సవం మాడవీధుల్లో చేపట్టారు. ఊరేగిన జోడు సేవలను భక్తులు దర్శించుకున్నారు. రాత్రివేళ మూలవరులకు ఆరాధన, సహస్రనామార్చన జరిపారు. శయనోత్సవం జరిపి, ఆలయ బంధనం చేశారు. దర్బార్‌ సేవోత్సవాన్ని నిర్వహించిన పూజారులు నిత్యాదాయం వెల్లడించారు. గురువారం వివిధ విభాగాల ద్వారా ఆలయానికి నిత్యాదాయం రూ.23,19,262 చేకూరాయని ఆలయ ఈవో గీత తెలిపారు.

శ్రీరామనవమి...

యాదాద్రి పుణ్యక్షేత్రంలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా గురువారం ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తూ అభిషేకం, అర్చనలు చేపట్టారు. ప్రధాన పూజారి నర్సింహయ్యశర్మ పూజలు నిర్వహించగా ఆలయ అధికారులు పేష్కార్‌ రఘు, పర్యవేక్షకులు శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని