logo

ప్రభుత్వ అసమర్థతతోనే ప్రశ్నపత్రాల లీకేజీ: సంకినేని

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.

Published : 24 Mar 2023 04:44 IST

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాతర్లపహాడ్‌లో గురువారం ఆయుష్మాన్‌ భారత్‌ శిబిరాన్ని సంకినేని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను మోసం చేసిన ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని తెలిపారు. ప్రభుత్వ చర్యలను గమనిస్తే అసలు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పరీక్షలైనా సక్రమంగా జరిగాయా అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలను వ్యతిరేకించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న తీన్మార్‌మల్లన్న అక్రమ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ దోషులను కఠినంగా శిక్షించి యువతకు ఉద్యోగాలివ్వాలన్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో భాజపా ఆధ్వర్యంలో  తలపెట్టిన నిరుద్యోగ మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పందిరి రాంరెడ్డి, నాయకులు కర్నాటి కిషన్‌, మన్మథరెడ్డి, గడ్డం శ్రీనివాసరెడ్డి, అస్లాం, వీరేందర్‌, కర్ణాకర్‌రెడ్డి, పందిరి మాధవరెడ్డి, తూడి సారయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని