logo

పదవులు పొంది పార్టీ సమావేశాలకు రారా?: కడియం

భారాస ప్రతినిధులమని చెప్పుకుని పార్టీ పదవులు పొందాక ఆ పార్టీ సమావేశాలకు హాజరుకాకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.

Updated : 26 Mar 2023 06:16 IST

ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

తిరుమలగిరి(సాగర్‌), న్యూస్‌టుడే: భారాస ప్రతినిధులమని చెప్పుకుని పార్టీ పదవులు పొందాక ఆ పార్టీ సమావేశాలకు హాజరుకాకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలో నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. సమావేశానికి దూరంగా ఉన్న నాయకులు ఏ పార్టీ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌, భాజపా నాయకుల వలే భారాసలో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి వీల్లేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని దానికి పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ఎమ్మెల్యే భగత్‌ను ముందుకు నడిపించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అనేక దశాబ్దాలుగా అధికారంలో ఉండి  అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాయక్‌ మాట్లాడుతూ  కేసీఆర్‌ పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు.ఎమ్మెల్యేభగత్‌, జడ్పీవైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, భారాస సీనియర్‌ నాయకులు యడవల్లి విజయేందర్‌రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు పిడిగం నాగయ్య, భిక్షనాయక్‌, బాబురావునాయక్‌, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.

హాలియా: ఆత్మీయ సమావేశంలో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో ఎదురుదాడి మొదలైంది. మీరు ఇక్కడికి వచ్చింది భారాస కార్యకర్తలను కలుపుకుని వెళ్లడానికా?లేక పార్టీని చీల్చడానికా? వేదికపై ఏం మాట్లాడారో పునరాలోచన చేసుకోండి.. అంటూ కడియం శ్రీహరి వ్యాఖ్యలపై ఓ సందేశం శనివారం రాత్రి వైరల్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు