logo

పండగలు శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్‌

మతసామరస్యం పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా పండగలను జరుపుకోవాలని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Updated : 26 Mar 2023 06:13 IST

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: మతసామరస్యం పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా పండగలను జరుపుకోవాలని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రంజాన్‌ మాసం ఈ నెల 23న ప్రారంభం, మార్చి 30న శ్రీరామనవమి, ఏప్రిల్‌ 6న హనుమాన్‌ జయంతి, ఏప్రిల్‌ 7న గుడ్‌ప్రైడే, ఏప్రిల్‌ 9న ఈస్తర్‌ పండగలను పురస్కరించుకుని శనివారం నల్గొండ కలెక్టరేట్‌లో ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్‌ ఖుష్బూగుప్తాతో కలిసి నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతి కమిటీల సలహాలు, సూచనలు అనుసరించి జిల్లా యంత్రాంగం ద్వారా వివిధ శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. మసీదుల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు ఏర్పాటు చేయాలని, ఈద్గా, మసీదులు, కబరస్థాన్‌ల వద్ద పిచ్చి మొక్కలు, అడ్డుగా ఉన్న కొమ్మలు తొలగించాలన్నారు. వీధి కుక్కలు, పందుల బెడద నివారించి పట్టణ శివారుకు తరలించాలని పుర కమిషనర్‌ను ఆదేశించారు. పండగల సందర్భంగా నిరంతర విద్యుత్‌ సరఫరా చేసేలా ఆదేశించారు. చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేయాలని, గ్యాస్‌ సరఫరా ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారిని ఆదేశించారు. చక్కెర సరఫరా చేయాలని పలువురు ముస్లిం మత పెద్దలు కోరగా ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. పండగల సందర్భంగా ఆహార పదార్థాలు కల్తీ లేకుండా తనిఖీలు నిర్వహించాలని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించనున్నట్లు చెప్పారు. ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ పోలీసు శాఖ ద్వారా బందోబస్తు ఏర్పాటు చేస్తామని, రాత్రి వేళ గస్తీ, ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీస్‌ పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. శాంతి సంఘం సభ్యులు అబ్దుల్‌ఖలీం, హషం, రఫి, అదనపు ఎస్పీ కేఆర్‌కే ప్రసాదరావు, డీఎస్‌పీలు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని