logo

కాపాడేందుకు వెళ్లి.. మృత్యుఒడికి

రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడేందుకు వెళ్లిన యువకుడు మృత్యుఒడికి చేరుకున్న విషాద ఘటన శనివారం చివ్వెంల మండలంలో చోటుచేసుకుంది.

Published : 26 Mar 2023 04:45 IST

మధు

చివ్వెంల, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడేందుకు వెళ్లిన యువకుడు మృత్యుఒడికి చేరుకున్న విషాద ఘటన శనివారం చివ్వెంల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నశింపేటకు చెందిన ములకలపల్లి మధు(26) సూర్యాపేటలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. రోజు మాదిరిగా విధులు ముగించుకొని శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్లేందుకు కుడకుడరోడ్డు నుంచి బయలుదేరారు. అయిలాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో చివ్వెంల మండలం రోళ్లబండతండా సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఖమ్మంకు చెందిన నవీన్‌(27) తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మధు తన వాహనాన్ని పక్కన నిలిపి క్షతగాత్రుడు నవీన్‌ను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఎక్కించారు. తిరిగి తన వాహనం వద్దకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మధు ఎగిరి కొంత దూరంంలో పడి అక్కడికక్కడే మృతిచెందారు. నవీన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని