logo

‘డబుల్‌’ పరేషాన్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రహసనంగా మారింది.

Published : 26 Mar 2023 04:45 IST

ఆలేరు: లబ్ధిదారుల ఎంపిక సభలో అధికారులతో దరఖాస్తుదారుల వాగ్వాదం

ఆలేరు, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రహసనంగా మారింది. అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులకు సమస్య తల బొప్పి కట్టిస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లు నిర్మించగా.. వేల సంఖ్యలో పేదలు దరఖాస్తులు చేయడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. పూర్తయిన ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇప్పటికే ఆయా గ్రామాలలో రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికపై అధికారులు అఖిలపక్షం నాయకులతో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు.

829 పంపిణీకి సిద్ధం... యాదాద్రి జిల్లాలో 1,603 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. 1,158 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 829 పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరో 574 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. భువనగిరి పట్టణంలోని నిర్మించిన 444 ఇళ్లకు 3,600 మంది దరఖాస్తు చేశారు. ఆలేరు పట్టణంలో 64 ఇళ్లకు 530 మంది దరఖాస్తు చేశారు. భూదాన్‌పోచంపల్లి, వంగపల్ల్లిలోనూ తీవ్ర పోటీ నెలకొంది. ఆత్మకూరు(ఎం), బీబీనగర్‌, తుర్కపల్లి, మోటకొండూరు, కొలనుపాక, మాసాయిపేట, ఉప్పలపహాడ్‌, కొండమడుగు, సర్వేల్‌, దండుమల్కాపూర్‌, జిబ్లక్‌పల్లిలో లబ్ధిదారుల ఎంపికలు పూర్తయ్యాయి.

పట్టణాలు, గ్రామాల వారీగా మంజూరైన ఇళ్లు...   భువనగిరిలో 444, భూదాన్‌పోచంపల్లిలో 120, ఆలేరులో 64, దండుమల్కాపూర్‌లో 72, కొలనుపాక, సర్వేల్‌లలో 64 చొప్పున, ఆత్మకూరు(ఎం)లో 48, ఉప్పలపహాడ్‌లో 45, తుర్కపల్లి, మోటకొండూరు, మాసాయిపేట, వంగపల్లిలో 40 చొప్పున, జిబ్లక్‌పల్లిలో 36, కొండమడుగులో 30, బీబీనగర్‌లో 11 చొప్పున ఇళ్లు మంజూరయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని