logo

కార్పొరేట్‌ శక్తులకు మేలు చేస్తున్న భాజపా: జూలకంటి

మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు మేలు చేస్తూ పేదలపై భారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.

Published : 27 Mar 2023 03:16 IST

నేరేడుచర్ల: జనచైతన్య యాత్రలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

నేరేడుచర్ల, గరిడేపల్లి, న్యూస్‌టుడే: మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు మేలు చేస్తూ పేదలపై భారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో నిర్వహిస్తున్న జనచైతన్య యాత్ర ఆదివారం నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాజపా అధికారంలోకి వచ్చినప్పుడు రూ.65 లక్షల కోట్లు ఉన్న అప్పులు ఇప్పుడు రూ.145 లక్షల కోట్లకి పెరిగాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భాజపాని ఓడించడం లక్ష్యంగా భారాసతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జునరెడ్డి, రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు సుదర్శన్‌రావు, మండల కార్యదర్శి శ్రీను, జిల్లా కమిటీ సభ్యుడు నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని