logo

మిర్యాలగూడ సీటు నాదే... భాస్కర్‌రావు ధీమా

తెరాస వామపక్షాల పొత్తులో భాగంగా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని సీపీఎంకు కేటాయిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని ఎమ్మెల్యే భాస్కర్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

Published : 27 Mar 2023 03:16 IST

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: తెరాస వామపక్షాల పొత్తులో భాగంగా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని సీపీఎంకు కేటాయిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని ఎమ్మెల్యే భాస్కర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడ పట్టణంలో  ఆదివారం నిర్వహించిన భారాస వేములపల్లి మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 31 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచిన తనదే మిర్యాలగూడ సీటు అని, వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని, కారు గుర్తు ఉంటుందని పేర్కొన్నారు. సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర ఆదివారం మిర్యాలగూడ నియోజకవర్గానికి చేరిన సందర్భంగా ఆ పార్టీ స్థానికంగా బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా భాస్కర్‌రావు వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.  కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి ,సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారు తిరిగి ఆయన పార్టీకి ఓట్లు వేయకపోతే దేవుడు కూడా క్షమించడని అన్నారు. ప్రతిపక్ష పార్టీల వారు నాలుగు చీరలు పంచినంత మాత్రాన ప్రజలు వారికి ఓట్లు ఎందుకు వేయాలో ఆలోచించుకోవాలని హితవు పలికారు. సోదరీమణులకు ఎన్ని చీరలు కావాలన్నా తాను పంపిస్తానని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలు తన పరిధిలోనే ఉన్నాయని, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని