logo

ఆర్టీసీ బస్సు దగ్ధం

సాంకేతిక కారణాలు తలెత్తి ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు సమీపంలో జరిగింది

Updated : 30 Mar 2023 05:43 IST

సూర్యాపేటలో దగ్ధమవుతున్న రాజధాని బస్సు

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: సాంకేతిక కారణాలు తలెత్తి ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు సమీపంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం ఆర్టీసీ డిపోనకు చెందిన రాజధాని ఏసీ బస్సు పద్దెనిమిది మంది ప్రయాణికులతో బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు బయలుదేరింది. చివ్వెంల మండలం బీబీగూడెం వద్దకు వచ్చిన తర్వాత సాంకేతిక లోపంతో బస్సులోంచి పొగలు వచ్చాయి. గుర్తించిన చోదకుడు వెంటనే బస్సును నిలిపి ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించారు. మరమ్మతుల అనంతరం బస్సును సూర్యాపేట డిపోనకు తరలిస్తుండగా ఖమ్మం క్రాస్‌రోడ్డు సమీపంలోని మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బయటకు వచ్చి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ సంస్థకు సుమారు రూ.25 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు