logo

పోక్సో కేసులో ఒకరికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

పోక్సో కేసులో మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గులగట్టు క్రాంతి(19)పై నేర నిరూపణ కావడంతో పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు జరిమానాలు విధిస్తూ పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ప్రేమలత బుధవారం తీర్పుచెప్పారు. నిందితుడు క్రాంతి మద్దిరాల మండలానికి చెందిన బాలిక(16)తో పరిచయం పెంచుకున్నాడు.

Published : 30 Mar 2023 04:17 IST

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: పోక్సో కేసులో మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గులగట్టు క్రాంతి(19)పై నేర నిరూపణ కావడంతో పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు జరిమానాలు విధిస్తూ పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ప్రేమలత బుధవారం తీర్పుచెప్పారు. నిందితుడు క్రాంతి మద్దిరాల మండలానికి చెందిన బాలిక(16)తో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో వెంటపడి బెదిరించి లొంగదీసుకున్నాడు. 2017 అక్టోబరు 20న బాలికను బెదిరించి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుపై మద్దిరాల పోలీసులు కేసు నమోదు చేయగా విషయం తెలుసుకున్న నిందితుడు ఆమెను వదిలిపెట్టాడు. దర్యాప్తు చేపట్టిన అప్పటి తుంగతుర్తి సీఐ పి.శ్రీనివాస్‌ నిందితుడు క్రాంతిపై కిడ్నాప్‌, అత్యాచారంతోపాటు పోక్సో చట్టం ప్రకారం అభియోగపత్రం దాఖలు చేశారు. సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితునిపై ఆరోపించిన అన్ని నేరాలను నిర్ధారించుకుంది. అత్యాచారం జరిపినందుకు పదేళ్ల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా, కిడ్నాప్‌ చేసినందుకు మూడేళ్ల జైలు, రూ.500 జరిమానా, అక్రమంగా నిర్బంధించినందుకు మూడు నెలలు, బెదిరింపులకు పాల్పడినందుకు నెల జైలుశిక్ష విధించారు. శిక్షలన్నింటినీ దోషి క్రాంతి ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. బాధితురాలికి పరిహారం రూ.1లక్ష చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రాసిక్యూషన్‌ తరఫు అదనపు పి.పి. కాకి రాంరెడ్డి కేసు వాదించగా లైజన్‌ ఆఫీసర్‌ జి.శ్రీకాంత్‌, కోర్టు డ్యూటీ పి.సి సైదులు ప్రాసిక్యూషన్‌కు సహకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని