logo

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్‌

రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను  వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి  డిమాండ్‌ చేశారు.

Published : 31 Mar 2023 04:39 IST

దామరచర్ల, న్యూస్‌టుడే: రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను  వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి  డిమాండ్‌ చేశారు.గురువారం దామరచర్ల మార్కెట్‌ సబ్‌యార్డులో నిల్వ ఉన్న ధాన్యం రాశులను పరిశీలించి మాట్లాడారు. ధాన్యాన్ని ఆరబోసి రైతులు 15 రోజులుగా కేంద్రాల వద్ద ఉంటున్నట్లు తెలిపారు. యార్డులో పదివేల బస్తాలు ఉన్నాయన్నారు.కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవన్నారు. వర్షం వస్తే టార్పాలిన్లు లేవన్నారు.  కొనుగోలుకు ప్రభుత్వం వారం రోజులు గడువు నిర్ణయించడం తగదన్నారు. సత్వరమే కొనుగోళ్లు చేపట్టే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వినోద్‌నాయక్‌, పాపానాయక్‌, దయానంద్‌, సుభాని, గోపి, విజయ్‌, శ్రీహరి తదితరులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని