logo

వాహనం ఢీకొని బాలుడి మృతి

అడవిదేవులపల్లి మండలం గోన్యాతండాలో వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన  గురువారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 31 Mar 2023 04:39 IST

అడవిదేవులపల్లి, న్యూస్‌టుడే:  అడవిదేవులపల్లి మండలం గోన్యాతండాలో వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన  గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోన్యాతండాలో రాత్రి ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడు పాతులోతు ప్రేమ్‌కుమార్‌(3)ని  టాటాఏస్‌ వాహనం అతివేగంతో ఢీకొట్టింది. గమనించిన  డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతి వేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలుకాగా కుటుంబ సభ్యులు  మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు తెలిపారు.  వాహనాన్ని ఠాణాకు తరలించినట్లు, బాలుడి తండ్రి బాల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని