logo

గమ్మత్తులో.. గాడి తప్పి

ఉమ్మడి జిల్లాలో కొంత మంది యువత చెడు వ్యవసనాలకు బానిసలు అవుతున్నారు. మద్యం, గంజాయి, మత్తు మాత్రలు, టానిక్‌లతో పాటు కొత్తగా వస్తున్న కొన్ని రకాల శీతల పానియాల్లో చాక్లెట్లను కలిపి మత్తును అనుభవిస్తున్నారు.

Published : 31 Mar 2023 04:39 IST

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో కొంత మంది యువత చెడు వ్యవసనాలకు బానిసలు అవుతున్నారు. మద్యం, గంజాయి, మత్తు మాత్రలు, టానిక్‌లతో పాటు కొత్తగా వస్తున్న కొన్ని రకాల శీతల పానియాల్లో చాక్లెట్లను కలిపి మత్తును అనుభవిస్తున్నారు. కొన్ని రకాల నొప్పుల మాత్రలతో 24 గంటల వరకు మత్తు  ఉంటుందని వాటిని కొందరు యువకులు ఉపయోగిస్తున్నారు. మత్తుకు బానిసైనవారు కాలేయం, మూత్రపిండాలు, గుండె, మతిమరుపు, రక్తహీనత, నరాల బలహీనత వంటి వ్యాధులకు గురవుతున్నారు.

  చందంపేట మండలం కంబాలపల్లి ప్రాంతానికి చెందిన చంద్రునాయక్‌(32) మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. రెండు మూత్రపిండాలు పనిచేయక పోవడంతో జనరల్‌ ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యశ్రీ పథకం కింద గడిచిన ఆరు నెలల్లో రూ.లక్షకు పైగా ఖర్చు చేశారు. ప్రస్తుతం డయాలసిస్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యుడు తెలిపారు.

   జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ముగ్గురు స్నేహితులు ప్రారంభంలో ఇంట్లో నుంచి నగదు తెచ్చుకుని బీర్లు తాగేవారు. గమనించిన   కుటుంబ సభ్యులు పోలీసుల ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించారు. అయినా వారిలో మార్పు రాకపోగా గంజాయికి అలవాటు పడ్డారు.


చెడు స్నేహానికి దూరంగా ఉండాలి
డాక్టర్‌ శివరామకృష్ణ, మానసిక వైద్య నిపుణుడు, నల్గొండ

జిల్లాలో మత్తుకు బానిసలవుతున్న వారిలో 30 శాతం మంది విద్యార్థులు, యువకులే ఉంటున్నారు. విద్యార్థులు చెడు స్నేహానికి దూరంగా ఉండాలి. మత్తు కారణంగా రోడ్డు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇలాంటి వారిపై తల్లిదండ్రులు, విద్యాసంస్థల్లో అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని