logo

మద్యం పాలసీ విధానాలపై ప్రభుత్వాలు ఆలోచించాలి: గవర్నర్‌ దత్తాత్రేయ

రెండు తెలుగు రాష్ట్రాలలో మాదక ద్రవ్యాలు, మద్యం యువతను పట్టి పీడిస్తున్నాయని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

Published : 31 Mar 2023 04:39 IST

కేతేపల్లిలో మాట్లాడుతున్న హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

కేతేపల్లి, న్యూస్‌టుడే: రెండు తెలుగు రాష్ట్రాలలో మాదక ద్రవ్యాలు, మద్యం యువతను పట్టి పీడిస్తున్నాయని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. భద్రాచలంలో గురువారం జరిగిన శ్రీరామనవమికి హాజరై తిరిగి హైదరాబాద్‌ వెళుతున్న ఆయన కేతేపల్లిలో కొద్దిసేపు ఆగారు. విలేకరులతో మాట్లాడుతూ మత్తు పదార్థాలతో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉన్నత విద్య చదువుతున్న యువత పెడదోవ పడుతున్నారని పేర్కొన్నారు. యువతను గాడిలోపెట్టి నడిపించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉందన్నారు. మద్యం పాలసీ విధానాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శి అయితగోని అనిత పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని