logo

ఉలి చేతపట్టి.. శ్రీకారం చుట్టి

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లోని భారీ బుద్ధ విగ్రహం( ఏకశిల) రాయగిరికి చెందినదే.

Published : 31 Mar 2023 04:39 IST

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లోని భారీ బుద్ధ విగ్రహం( ఏకశిల) రాయగిరికి చెందినదే. 1985 అక్టోబరు 2న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్వయాన ఉలి చేతపట్టి రాయగిరిలోని ఏకశిల కొండపై బుద్ధుని విగ్రహాన్ని రూపొందించే పనులకు శ్రీకారం చుట్టారు. 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బరువు కలిగిన విగ్రహ రూప ఆవిష్కరణకు నాటి దేవాదాయశాఖ స్థపతి గణపతి నేతృత్వంలో నాలుగేళ్లుగా రెండొందల మంది శిల్పులు శ్రమించారు. నాటి శ్రీకారం పర్వంలో ఎన్టీఆర్‌తో పాటు అప్పటి మంత్రులు యతిరాజారావు, జానారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, భువనగిరి ఎమ్మెల్యే మాధవరెడ్డి పాల్గొన్నారు. ఫొటో చూస్తే 38 ఏళ్ల నాటి అపూర్వ ఘటన గుర్తుకొస్తుంది.

 న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని