logo

దైవ దర్శనానికి అదనపు వరసలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు దైవ దర్శనం సులభంగా, త్వరితగతిన చేకూరేందుకు అదనపు వరసలు ఏర్పాటవుతున్నాయి

Published : 31 May 2023 05:06 IST

బ్రహ్మోత్సవ మండపం వద్ద గ్రిల్స్‌

యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు దైవ దర్శనం సులభంగా, త్వరితగతిన చేకూరేందుకు అదనపు వరసలు ఏర్పాటవుతున్నాయి. క్షేత్రాభివృద్ధిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల మహా దివ్య ఆలయ సందర్శనకు భక్తుల రాక పెరుగుతోంది. దీంతో దైవ దర్శనం కోసం భక్తులు గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తోంది. మున్ముందు భక్తుల రాక మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఆలయ నిర్వాహకులు అదనంగా వరసల ఏర్పాట్లపై దృష్టిసారించారు. పసిడి వర్ణం కాంప్లెక్స్‌లో మధ్యన స్టీల్‌ గ్రిల్స్‌తో మరో వరసను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ తూర్పు వైపున గల బ్రహ్మోత్సవ మండపం పరిసరాల్లోనూ అదనంగా స్టీల్‌ గ్రిల్స్‌తో పనులు ముమ్మరం చేశారు. ఈ ఏర్పాట్లతో దైవదర్శనం కోసం వేచి ఉండే భక్తులను వరస క్రమంలో ప్రధానాలయంలో ప్రవేశింపజేసేందుకు వీలు కలుగుతుందని దేవస్థానం సివిల్‌ విభాగం డిప్యూటీ ఈఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు. తూర్పు ముఖంగా ఆలయం ఎదుటే కాకుండా, అదనపు వరసలు గర్భాలయం వరకూ ఏర్పాటవుతున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు