logo

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సైరెడ్డి చెన్నారెడ్డి కన్నుమూత

సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ సీనియర్‌ నేత సైరెడ్డి చెన్నారెడ్డి (95) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు.

Updated : 31 May 2023 05:29 IST

నాగారం, భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ సీనియర్‌ నేత సైరెడ్డి చెన్నారెడ్డి (95) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్టు నేతగా ఉంటూ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా భీమిరెడ్డి నర్సింహారెడ్డి(బీఎన్‌రెడ్డి)తో కలిసి ఉద్యమించారు. ఈయనకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సైరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి ఏసీపీగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఏసీపీ తెలిపారు. చెన్నారెడ్డి మృతికి యాదాద్రి భువనగిరి జోన్‌ డీసీపీ రాజేశ్‌చంద్ర, తిరుమలగిరి మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ యారాల రాంరెడ్డి, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని