త్వరలో.. పురపాలికల్లో ఆధునిక ధోబీఘాట్లు
రజకుల కులవృత్తికి సాంకేతిక హంగులను మేళవించి ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ర¢జకులకు ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్తు ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేసింది.
19 పట్ణణాల్లో నిర్మాణానికి శ్రీకారం
నల్గొండలో ఏర్పాటు చేసిన ఆధునిక ధోబీఘాటు
నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: రజకుల కులవృత్తికి సాంకేతిక హంగులను మేళవించి ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ర¢జకులకు ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్తు ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేసింది. ఉచితంగా కరెంటు సరఫరా చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే స్మార్ట్ నగరాల్లో చేపట్టిన ఆధునిక ధోబీఘాట్ల సేవలు విజయవంతం కావడంతో.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో అన్ని పట్టణాలు, నగరాలు, పురపాలికల్లో ధోబీఘాట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికలకు మంజూరు చేస్తూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.
రూ.2 కోట్ల చొప్పున..
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలో 19 పురపాలికలు ఉన్నాయి. ప్రతి పట్టణంలో ఒక్కో ధోబీఘాటు నిర్మాణానికి టీయూఎఫ్‌ఐడీసీ పథకం ద్వారా రూ.రెండు కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఆయా పురపాలికల్లో యాంత్రీకరణతో కూడిన ధోబీఘాట్ల నిర్మాణాలకు స్థల సేకరణ పూర్తి చేసి ప్రజారోగ్యశాఖకు అప్పగించంతో అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు.
సత్వర సేవలు..
ఆధునిక ధోబీఘాట్లలో పెద్దపెద్ద యంత్రాలు ఏర్పాటు చేయనుండటంతో ఒకేసారి 100 జతలకు పైగా దుస్తులు ఉతికే సామర్థ్యం ఉంటుంది. వాటిని ఇస్త్రీ చేయడం కూడా ఆధునిక పద్ధతే కావడంతో రజకులకు సమయం వృథా కాకుండా సత్వర సేవలను అందించే అవకాశం ఉంటుంది. పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న ఆస్పత్రులు, వసతిగృహాలు ఎక్కువ సంఖ్యలో దుస్తులు, దుప్పట్లు ఉతికించేందుకు ధోబీఘాట్లను ఆశ్రయిస్తున్నారు. తద్వారా రజకులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడే అవకాశం ఉంది.
త్వరలో పనులు ప్రారంభం
సత్యనారాయణ, ఈఈ, ప్రజారోగ్యశాఖ
ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాం. త్వరలోనే పనులు ప్రాంరభించి ఈ ఏడాది చివరి నాటికి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.