logo

తెలుగువారికి ఉన్న ప్రతిభ, తెగింపు, పట్టుదల ఎవరికీలేదు

తెలుగువారికున్న ప్రతిభ, తెగింపు, చదువు, పట్టుదల ప్రపంచంలో ఎవరికీలేదని రాష్ట్ర మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో జరుగుతున్న సీఎం కప్‌-2023, రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు బుధవారం ముగిశాయి.

Published : 01 Jun 2023 03:11 IST

రాష్ట్ర మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి వెల్లడి

బాలికల విభాగంలో విజేతగా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా జట్టుకు షీల్డు,  పతకాలు అందించిన మంత్రి మల్లారెడ్డి, సాట్స్‌ ఛైర్మన్‌ ఆంజనేయులు గౌడ్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: తెలుగువారికున్న ప్రతిభ, తెగింపు, చదువు, పట్టుదల ప్రపంచంలో ఎవరికీలేదని రాష్ట్ర మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో జరుగుతున్న సీఎం కప్‌-2023, రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. దేశ చరిత్రలో మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడలను నిర్వహించి, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నది ఒక్క భారాస ప్రభుత్వమేనని తెలిపారు. సాట్స్‌ ఛైర్మన్‌ ఆంజనేయులుగౌడ్‌ మాట్లాడుతూ... క్రీడాకారులు పతకాల పంట పండించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారని కొనియాడారు. అనంతరం మంత్రి, ఆంజనేయులుగౌడ్‌ తదితరులు.. విజేత జట్లకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో 33 వివిధ జిల్లాల బాలురు, బాలికల జట్లు పాల్గొన్నాయి. బాలుర జట్లలో హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగోస్థానాల్లో నిలిచాయి. బాలికల జట్లలో యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌ జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో సుధాకర్‌, సాయన్న, కృష్ణమూర్తి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని