logo

ఫ్లెక్సీల రగడ

నల్గొండ పట్టణంలో తాజాగా ఫ్లెక్సీల రగడ రాజుకుంది. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మధ్య విభేదాలు దశాబ్ది  ఉత్సవాల సాక్షిగా రచ్చకెక్కాయి.

Published : 01 Jun 2023 03:11 IST

పట్టణంలో హైదరాబాద్‌ రహదారిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

ఈనాడు, నల్గొండ : నల్గొండ పట్టణంలో తాజాగా ఫ్లెక్సీల రగడ రాజుకుంది. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మధ్య విభేదాలు దశాబ్ది  ఉత్సవాల సాక్షిగా రచ్చకెక్కాయి. జూన్‌ రెండున నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సుఖేందర్‌రెడ్డి హాజరై కలెక్టరేట్‌లో జెండావిష్కరణ చేస్తారని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్సవాల్లో పట్టణ అలంకరణలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఫ్లెక్సీలను పెట్టారు. ఇందులో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డితో పాటూ స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఫొటోలు  ప్రధానంగా ఉండగా...ప్రభుత్వం ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రకటించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి ఫొటోలను ప్లెక్సీలో చిన్నగా ముద్రించారు. దీంతో ప్రొటోకాల్‌ తెలియదా అంటూ.. గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గీయులు పురపాలిక సంఘం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు సైతం చేసినట్లు సమాచారం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని