logo

నారసింహుడికి స్వాతి నక్షత్ర ఆరాధనలు

యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట ఆలయంలోనూ ఈ విశేష పర్వాన్ని చేపట్టారు.

Published : 02 Jun 2023 04:48 IST

కల్యాణమూర్తులు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట ఆలయంలోనూ ఈ విశేష పర్వాన్ని చేపట్టారు. ఆలయ దేవుడైన నారసింహుడి జన్మ నక్షత్రం స్వాతి కావడంతో గర్భగుళ్లోని స్వయంభువులకు ఈ ప్రత్యేక అభిషేకం వేద, మంత్రపఠనాల మధ్య చేపట్టారు. వేకువజామున సుప్రభాతం నిర్వహించాక ఆస్థాన పరక్రతువులను జరిపి, అభిషేకం జరిపారు. తొలుత కలశ ఆరాధనలు జరిపారు. ప్రధాన కలశంతో గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. పంచనారసింహుల ఆలయంలో నిత్య కల్యాణోత్సవాన్ని ఆలయ ఆచారంగా చేపట్టారు. ఆలయ మహాముఖ మండపంలో అష్టోత్తరం, స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. రాత్రి స్వాతి సేవా పర్వాన్ని చేపట్టారు. స్వాతి నక్షత్రం సందర్భంగా చేపట్టిన అష్టోత్తర శతఘటాభిషేకంలో ఆల య వంశంపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి దంపతులు, పేష్కార్‌ రఘు, పర్యవేక్షకుడు నరేశ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని