logo

దివ్యాంగుడికి చక్రాల కుర్చీ

‘మాట్లాడలేడు...నడవలేడు’ ‘పద్నాలుగేళ్లుగా సేవలందిస్తున్న తల్లిదండ్రులు’ శీర్షికతో తంగడపల్లికి చెందిన ఊదరి పవన్‌కుమార్‌ దీన స్థితిపై ‘ఈనాడు’లో

Published : 02 Jun 2023 04:48 IST

పవన్‌కుమార్‌కు చక్రాల కుర్చీని అందజేస్తున్న రఘు అరికపూడి

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: ‘మాట్లాడలేడు...నడవలేడు’ ‘పద్నాలుగేళ్లుగా సేవలందిస్తున్న తల్లిదండ్రులు’ శీర్షికతో తంగడపల్లికి చెందిన ఊదరి పవన్‌కుమార్‌ దీన స్థితిపై ‘ఈనాడు’లో ప్రచురించిన మానవీయ కథనానికి రఘు అరికపూడి సేవా ట్రస్ట్‌ స్పందించింది. అమ్మానాన్నలే ఆలంబనగా ఎదుగుతున్న పవన్‌కుమార్‌ శారీరక, మానసిక వైకల్యంతో పాటు ఫిట్స్‌తో బాధపడుతున్నాడని, అతన్ని పద్నాలుగేళ్లుగా తల్లిదండ్రులే భుజాలపై మోస్తున్నారని పత్రికలో చదివి స్పందించిన ట్రస్ట్‌ ఛైర్మన్‌ రఘు సమాజ సేవకుడు అక్కినేని రాజీవ్‌ ఆర్థిక సహాయంతో చక్రాల కుర్చీని కొనుగోలు చేసి గురువారం తంగడపల్లిలో పవన్‌కుమార్‌కు అందజేశారు. తాపీ మేస్త్రీగా కూలి పని చేసే తండ్రి బాబుకు గతంలో ప్రమాదం జరిగినందున సరిగా పని చేయలేడని, తల్లి అనురాధ కుమారుడి బాగోగులు, నలుగురి పిల్లల పోషణ చూస్తూ ఇంటి వద్దే ఉంటున్నారు. కుటుంబం గడవడం కష్టంగా ఉందని తెలుసుకుని తమ ట్రస్టు ద్వారా భవిష్యత్తులో సహాయం అందిస్తామని రఘు భరోసా ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని