ముగిసిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు
రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జూనియర్ బాల, బాలికలకు మఠంపల్లి మాంట్‌ఫోర్ట్ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు గురువారం ముగిశాయి.
విజేతలుగా నల్గొండ బాలుర, సూర్యాపేట బాలికల జట్లు
మఠంపల్లి: రాష్ట్రస్థాయి రగ్బీ బాలికల జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన సూర్యాపేట జట్టుతో నిర్వాహకులు
మఠంపల్లి, న్యూస్‌టుడే: రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జూనియర్ బాల, బాలికలకు మఠంపల్లి మాంట్‌ఫోర్ట్ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు గురువారం ముగిశాయి. 15 జిల్లాలకు చెందిన 15 బాలికల జట్లు, ఆరు బాలుర జట్లు పాల్గొన్న ఈ పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. ‘లీగ్ కం నాకౌట్’ పద్ధతిలో జరిగిన తుది పోటీల్లో బాలుర విభాగంలో నల్గొండ, బాలికల విభాగంలో సూర్యాపేట జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో మేడ్చల్‌కు ద్వితీయ, సూర్యాపేట, నిజామాబాద్‌కు తృతీయ స్థానాలు, బాలికల విభాగంలో నల్గొండ, హైదరాబాదు జట్లు ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈనెల 4, 5, 6తేదీల్లో పుణెలో జరిగే జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు తెలంగాణ తరఫున ఎంపికైన బాల, బాలికల పేర్లనూ నిర్వాహకులు ప్రకటించారు. బాలుర జట్టుకు నల్గొండకు చెందిన మధు, సాయి, శ్రీకాంత్, మేడ్చల్‌కు చెందిన వాసు, అశోక్, రాఘవేంద్ర(సూర్యాపేట), గోపాల్ (నిజామాబాద్), అనిల్(మెదక్), గణేష్(ఖమ్మం), విఘ్నేష్(వరంగల్), ప్రణయ్(సిద్ధిపేట), వెంకటేష్(మహబూబాబాద్), బాలికల జట్టుకు మహేశ్వరి, శ్రీవిద్య, శిరీష, రాజశ్రీ(సూర్యాపేట), అరుణ, దివ్య, అఖిల(నల్గొండ), సోనీ, చందన(హైదరాబాద్) స్పందన(వరంగల్), చందన(ఖమ్మం), లహరిక(మేడ్చల్) ఎంపికయ్యారని టోర్నమెంట్ నిర్వాహక కమిటీ కార్యదర్శి కె.తురుణ్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ ఎంపిక కమిటీ ఛైర్మన్ కె.గణేష్ రవికుమార్ తెలిపారు. జిల్లా ఛైర్మన్, సర్పంచి ఎం.శ్రీనివాసరెడ్డి విజేతలకు జ్ఞాపికలు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!