కనులపండువగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
మండలంలోని దూపహాడ్‌లో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి, దుర్గామహేశ్వరస్వామి దేవాలయంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు,
దూపహాడ్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
పెన్‌పహాడ్, న్యూస్‌టుడే: మండలంలోని దూపహాడ్‌లో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి, దుర్గామహేశ్వరస్వామి దేవాలయంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని గురువారం కనులపండువగా నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాససన సభ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, ఖమ్మం జడ్పీ ఛైర్‌పర్సన్ ధనలక్ష్మీ, తదితరులు వేర్వేరుగా దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. దేవాలయ నిర్మాణ కర్త, సర్పంచి బిట్టు నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. దూపహాడ్ అభివృద్ధి కోసం తన నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్సీ మధుసూదనాచారి ప్రకటించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా యంత్రస్థాపన చేసిన అనంతరం శ్రీసీతారామ, లక్ష్మణ, హనుమాన్, దుర్గామహేశ్వర, జీవధ్వజ, విమాన శిఖర, ద్వారపాలక, చండ, ప్రచండ, చండీ, ప్రచండీ, సింహ, నందీశ్వర, నవగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. శాంతికల్యాణ మహోత్సవాన్ని పలువురు దంపతులతో జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. భక్తజనుల రాకతో దేవాలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, వైస్‌ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, సర్పంచి బిట్టు నాగేశ్వర్‌రావు, మాజీ సర్పంచి గుగ్గిళ్ల సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ
-
Rahul Gandhi: అమ్మకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..?
-
Supriya Sule: ‘హనీమూన్’ ముగియక ముందే.. మహా ప్రభుత్వంలో ముసలం?