బంతిలోనే..బతుకు వెదుక్కొంటూ..!
వాలీబాల్‌లో నేరేడుచర్ల మండల యువకులు మరోసారి సత్తా చాటారు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడల్లో వాలీబాల్ పోటీల్లో నేరేడుచర్ల మండల జట్టు ప్రతిభ కనబరిచి సూర్యాపేట జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి కప్ కైవసం చేసుకుంది.
నేరేడుచర్ల మండల వాలీబాల్ జట్టుకు కప్ అందజేస్తున్న విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నేరేడుచర్ల, న్యూస్‌టుడే: వాలీబాల్‌లో నేరేడుచర్ల మండల యువకులు మరోసారి సత్తా చాటారు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడల్లో వాలీబాల్ పోటీల్లో నేరేడుచర్ల మండల జట్టు ప్రతిభ కనబరిచి సూర్యాపేట జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి కప్ కైవసం చేసుకుంది. మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా కప్ అందుకున్నారు. ఈ జట్టులోని కొందరు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగిన వాలీబాల్ పోటీల్లోనూ స్థానం దక్కించుకున్నారు. నిరంతర సాధనతోనే వీరు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతున్నారు. దిర్శించర్ల గ్రామ యువకులు వాలీబాల్ ఆటపై పట్టు సాధించడం వల్లే అలవోకగా విజయాలు సాధించగలుగుతున్నారు. తమ క్రీడా నైపుణ్యం ఉద్యోగావకాశాలకు దోహదం చేస్తుందని వారు నమ్ముతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఉన్న కొద్దిపాటి వసతులతోనే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.
వ్యాయామ ఉపాధ్యాయుడిని అవుతా..
మా నాన్న మట్టయ్య ఆటో నడుపుతూ నన్ను, మాచెల్లిని చదివిస్తున్నార[ు. బీపీఈడీ చేసి వ్యాయామ ఉపాధ్యాయుడిని కావాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నా. ఏడో తరగతి నుంచే వాలీబాల్ ఆడుతున్నా. కొత్తగూడెంలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నా. జిల్లా స్థాయిలో సీఎం కప్ గెలవడం ఆనందంగా ఉంది. ఆటపై పట్టు సాధించడం వల్లే గెలుపు సాధ్యమైంది.
నితిన్, ఇంటర్ ప్రథమ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నేరేడుచర్ల
పోలీసు ఉద్యోగ సాధనే లక్ష్యం
పోలీసు ఉద్యోగ సాధనే లక్ష్యంగా పెట్టుకున్నా. సమష్టి కృషితో జిల్లా స్థాయిలో సీఎం కప్ గెల్చుకోగలిగాం. పదో తరగతి నుంచే వాలీబాల్ ఆటపై మక్కువ పెంచుకున్నా. క్రీడా కోటా ఉద్యోగ సాధనకు అవకాశం ఉంటుంది. మా గ్రామం నుంచి చాలా మంది పోలీసు ఉద్యోగాల్లో ఉన్నారు. వారిలో చాలా మంది క్రీడాకారులే. వారి స్ఫూర్తితోనే ముందుకు వెళుతున్నాం.
నరేష్, డిగ్రీ ప్రథమ, కేఆర్‌ఆర్ కళాశాల, కోదాడ
ఆటపై పట్టు సాధించా..
మా నాన్న లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ మమ్మల్ని చదివిస్తున్నార[ు. కానిస్టేబుల్ కావాలన్నది నా కోరిక. పాఠశాల స్థాయి నుంచే వాలీబాల్ ఆటపై పట్టు సాధించా. ఆటలో స్ట్రైకర్‌గా రాణిస్తున్నా. కళాశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామంలో దాతలు క్రీడాకారులకు సహకారం అందిస్తూ పోత్సహిస్తున్నారు.
సంతోష్, ఇంటర్ ప్రథమ, గురుకుల కళాశాల, మిర్యాలగూడ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి
-
Shah Rukh Khan: ‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు
-
Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం