logo

భూ తగాదాల విషయమై బావను కడతేర్చిన బావమరిది

భూ తగాదాల విషయంలో బావను బావమరిది కడతేర్చిన ఘటన శుక్రవారం రాత్రి పీఏపల్లి మండలం అంగడిపేటస్టేజీ వద్ద చోటు చేసుకుంది. గుడిపల్లి పోలీసుల వివరాల ప్రకారం..

Published : 04 Jun 2023 04:12 IST

ఘటనాస్థలంలో మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎసీ నాగేశ్వర్‌రావు, సీఐ శ్రీనివాస్‌, తదితరులు

పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే: భూ తగాదాల విషయంలో బావను బావమరిది కడతేర్చిన ఘటన శుక్రవారం రాత్రి పీఏపల్లి మండలం అంగడిపేటస్టేజీ వద్ద చోటు చేసుకుంది. గుడిపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మారడుగుకు చెందిన సౌట అంజయ్య(35) పెయింటింగ్‌ పనిచేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. వివాహ సమయంలో ఇతనికి గుర్రంపోడు మండలం మొసంగిలో ఎకరం భూమి ఇచ్చారు. భూమి అమ్మకం గురించి చర్చించేందుకు నాలుగు రోజుల క్రితం పీఏపల్లి మండలం అంగడిపేటస్టేజీ వద్ద ఉండే బావమరిది నిర్సనమెట్ల వెంకటయ్య వద్దకు వచ్చాడు. శుక్రవారం రాత్రి ఇరువురు పరస్పరం గొడవపడ్డారు. ఘర్షణలో వెంకటయ్య అంజయ్య తలపై సుత్తితో కొట్టి హత్యచేశాడు. మృతదేహాన్ని బస్తాలో కట్టి సమీపంలోని ఏఎమ్మార్పీ డిస్ట్రీబ్యూటరీ -7(బి) కాల్వలో పడేశాడు. శనివారం మధ్యాహ్నం గుడిపల్లి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని దేవరకొండ డీఎసీ నాగేశ్వర్‌రావు పరిశీలించారు. కొండమల్లేపల్లి సీఐ శ్రీనివాసులు, కొండమల్లేపల్లి ఎస్సై వీరబాబులు ఉన్నారు. మృతుని భార్య పారిజాత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని