logo

పారిశుద్ధ్య నిర్వహణలో ఏరియా ఆసుపత్రికి పురస్కారం

జాతీయ ఆరోగ్యమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఎంపికచేసే పురస్కారానికి హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రి ఎంపికైందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కరణ్‌కుమార్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Published : 04 Jun 2023 04:12 IST

మొదటిసారి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రి

హుజూర్‌నగర్‌: జాతీయ ఆరోగ్యమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఎంపికచేసే పురస్కారానికి హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రి ఎంపికైందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కరణ్‌కుమార్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఆసుపత్రిలో బయో మెడికల్‌ వేస్టేజీ నిర్వహణ, రోగులకు ఇన్‌పెక్షన్లు రాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుద్ధ్యం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ బృందం ఫిబ్రవరిలో ఆసుపత్రిని సందర్శించి పై అంశాలను పరిశీలించి 70 శాతం మార్కులు ఇచ్చింది. దీంతో రాష్ట్ర అవార్డుకు ఎంపికైంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఏరియా ఆసుపత్రులు ఉండగా అందులో హుజూర్‌నగర్‌ సహ 40 ఆసుపత్రులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది సమష్టి కృషితో ఈ గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని