logo

ఈదురు గాలుల బీభత్సం

బీబీనగర్‌ మండలం రావిపహాడ్‌, రావిపహాడ్‌తండా, మాదారం గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.

Published : 08 Jun 2023 03:22 IST

నేల వాలిన వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు

వలిగొండ: రెడ్లరేపాకలో కూలిన చింత చెట్టు

బీబీనగర్‌, న్యూస్‌టుడే: బీబీనగర్‌ మండలం రావిపహాడ్‌, రావిపహాడ్‌తండా, మాదారం గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులు సుమారు 5 నిమిషాల పాటు వీయడంతో ఇంటి రేకులు లేచిదూరంగా ఎగిరిపడ్డాయి. రావిపహాడ్‌లో రోడ్లవెంట ఉన్న భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడటంతో అటువైపు వెళ్లే వాహనదారులు సుమారు గంట పాటు నానా తంటాలు పడ్డారు. రావిపహాడ్‌తండాలో విద్యుత్తు స్తంభాలు నెలకొరగడంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. తక్షణమే స్పందించిన ఆయా గ్రామపంచాయతీ ప్రతినిధులు రోడ్లపై పడ్డ వృక్షాలను తొలగించారు, విద్యుత్తు అధికారులు మరమ్మతులు చేపట్టారు. రావిపహాడ్‌తండాలో ఇంటి ముందర నిలిపిన గూడ్స్‌ వాహనం (బొల్లేరో మ్యాక్స్‌) ఈదుర గాలుల ధాటికి పల్టీ కొట్టింది.

బీబీనగర్‌ మండలం రావిపహాడ్‌లో రోడ్డుకు అడ్డంగా పడ్డ వృక్షాలు

వలిగొండ: మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం బుధవారం సాయంత్రం కురిసింది. కొమ్ము గంగయ్య, కందుల నర్సింహ, గాడిపల్లి కృష్ణ ఇంటి పైకప్పు లేచిపోయాయి. రావిడి మల్లారెడ్డి ఇల్లు పాక్షికంగా, దేశబోయిన దానయ్య ఇంటి ప్రహరీ కూలింది. నల్ల బాలయ్యకు చెందిన వరి కోత మిషన్‌పై చింత చెట్టు పడి ధ్వంసమైంది. కంచనపల్లి, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెంలో 40 విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని