logo

కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరి అరెస్టు

కల్తీ పాలను తయారు చేస్తూ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేసిన ఘటన మండల పరిధిలోని భీమనపల్లి, కనుముకుల గ్రామాల్లో బుధవారం చోటుచేసుకుంది.

Updated : 21 Sep 2023 05:20 IST

కనుముకులలో కల్తీ పాలకు వాడే రసాయనాలతో పట్టుబడిన కుంభం రఘు

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: కల్తీ పాలను తయారు చేస్తూ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేసిన ఘటన మండల పరిధిలోని భీమనపల్లి, కనుముకుల గ్రామాల్లో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై విక్రమ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భీమనపల్లి గ్రామానికి చెందిన కప్పల రవి, కనుముకుల గ్రామానికి చెందిన కుంభం రఘు చుట్టు పక్కల ప్రాంతాల్లో పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం ఎస్‌వోటీ పోలీసులు పాలు విక్రయించే ఇళ్లతో సోదా చేయగా రవి ఇంట్లో 350లీటర్ల కల్తీపాలు, 300 మి.గ్రా. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, రెండు కిలోల పాల పౌడర్‌ ప్యాకెట్‌లు, రఘు ఇంట్లో 100లీటర్ల కల్తీపాలు, 200 మి.గ్రా. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, 2కిలోల పాల పౌడర్‌ ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు. రసాయనాలతో పాలు తయారు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కల్తీపాలను, రసాయనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామన్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే సమాచారం అందించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని