logo

యాదాద్రిలో ఆధ్యాత్మిక పర్వాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం ఆధ్యాత్మిక పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

Published : 21 Sep 2023 03:40 IST

సాయంత్రం అలంకార సేవోత్సవం చేపడుతున్న దృశ్యం

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం ఆధ్యాత్మిక పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఆరాధిస్తూ హారతిని నివేదించిన పూజారులు ఉత్సవమూర్తులను పాలతో అభిషేకించారు. వేదమంత్రాల మధ్య తులసీ అర్చన జరిగింది. నిత్యకార్యక్రమాల్లో భాగంగా మండపంలో శ్రీ లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. పూజారులు మంత్రోచ్చరణలతో జరిపిన కల్యాణోత్సవంలో గజవాహనోత్సవాన్ని చేపట్టారు. పలువురు భక్తులు కల్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్ర సందర్శనకై వచ్చిన పలువురు భక్తులు సాయంత్రం జరిగిన అలంకార సేవోత్సవంలో పాల్గొని ఆశీస్సులు పొందారు. రాత్రి ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. శివాలయంలో రామలింగేశ్వరుడిని ఆరాధిస్తూ నిత్యపూజలు కొనసాగాయి. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్టలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామికి నిత్యారాధనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభావంతో క్షేత్రానికి భక్తులు తగ్గారు. దేవస్థానానికి వివిధ విభాగాల నుంచి రూ.11,65,964 లు నిత్యాదాయంగా ఈవో గీతారెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని