logo

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించండి: జూలకంటి

తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టరేట్‌ ముట్టడించారు.

Published : 21 Sep 2023 04:09 IST

కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించిన అంగన్‌వాడీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టరేట్‌ ముట్టడించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధంగా ఉన్న ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట నాలుగు గంటల పాటు బైఠాయించి నినదించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడారు. అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వం పర్మినెంట్‌ చేసి కనీస వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పది రోజులుగా  అంగన్‌వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నందున సీఎం స్పందించాలన్నారు. కనీసవేతనాలు, గ్రాడ్యూటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌, వారసులకు ఉద్యోగాలు, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చుతూ జీవోలు ఇచ్చి సమ్మె విరమింపచేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మలవీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోరాడుతున్న సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీసవేతనాలు రూ.26వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు డైట్‌ కళాశాల నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌ వరకు చేరుకున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్యక్షులు పొడిశెట్టి నాగమణి, వనం రాధిక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చినపాక లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ నాయకులు ఏసురత్నం, అంగన్‌వాడీల సంఘం నాయకులు కె.విజయలక్ష్మి, బి.పార్వతి, మణేమ్మ, సుమతమ్మ, శోభ, సలీం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని