logo

శాస్త్రోక్తంగా యాదాద్రీశుల నిత్యకల్యాణం

యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులను గురువారం కొలుస్తూ చేపట్టిన నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

Published : 22 Sep 2023 03:29 IST

అలంకార జోడు సేవ

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులను గురువారం కొలుస్తూ చేపట్టిన నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆలయ నిత్య కైంకర్యాలలో భాగంగా వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు మూలవరులను మేల్కొలిపి బిందెతీర్థం, బాలభోగం నివేదించాక హారతితో కొలిచారు. గోవుపాలతో నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. ఆలయ మహాముఖ మండపంలో వేద, మంత్ర పఠనాల మధ్య అష్టోత్తరం, స్వర్ణపుష్పార్చన పర్వాన్ని కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అష్టభుజి మండప ప్రాకారంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం నిర్వహించారు. కల్యాణమూర్తులను గజవాహనంపై అధిష్ఠింపజేసి సేవా పర్వాన్ని చేపట్టారు. సాయంత్రం భక్తుల ఆర్జిత పూజల్లో భాగంగా అలంకార సేవోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య అలంకార సేవలు ఊరేగించారు. రాత్రి స్వయంభువులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. దర్బార్‌ సేవ చేపట్టి నిత్య ఆదాయం వెల్లడించారు. వివిధ విభాగాల ద్వారా రూ.19,82,890 చేకూరింది. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. యాదాద్రి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం గణపతిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం, సాయంత్రం చేపట్టిన పూజల్లో ఆలయాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని