ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ అపూర్వరావు తెలిపారు.
వివరాలు తెలుపుతున్న నల్గొండ ఎస్పీ అపూర్వరావు
నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ అపూర్వరావు తెలిపారు. వారి నుంచి రూ. 14.20 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నల్గొండలో గురువారం ఆమె కేసు వివరాలు వెల్లడించారు. చెన్నైలో నివాసం ఉంటున్న కె.ఇమ్రాన్‌ఖాన్(37), ఇ.సూర్య(38) కొంత కాలంగా నల్గొండ, చౌటుప్పల్, అబ్దుల్లాపూర్‌మెట్, నార్కట్‌పల్లి, నకిరేకల్ ప్రాంతాల్లో మొత్తం 21 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. నిందితుల్లో సూర్య తన 13 ఏళ్ల వయస్సు వరకు మిర్యాలగూడలో కుటుంబ సభ్యులతో ఉండేవాడు. అప్పట్లో ఇంటి నుంచి వెళ్లి పోయి చెన్నైలో సినిమా షూటింగ్‌లో కూలి పని చేస్తున్న క్రమంలో మద్యం షాపు వద్ద ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు దొంగతనాలు ప్రారంభించారు. గత నెలలో నల్గొండలోని ముషంపల్లి రోడ్డులో ఉన్న ఇంట్లో ఆరు తులాల ఆభరణాలు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం పట్టణంలో ఇద్దరు అనుమానాస్పదంగా కన్పించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. వారి నుంచి 20 తులాల బంగారం ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు ఛేదించిన డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి, సీసీఎస్ సీఐ జితేందర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, గౌరిదేవి విష్ణువర్ధనగిరి, లింగారెడ్డి, పుష్పగిరి, ఇమ్రాన్, నరేశ్‌లను ఎస్పీ అభినందించారు.
వ్యసనాలకు బానిసై యువకుడి ఆత్మహత్య
గోపాలకృష్ణ
హుజూర్‌నగర్ గ్రామీణం, న్యూస్‌టుడే: చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గోపాలపురంలో చోటు చేసుకుంది. ఎస్సై పి.హరికృష్ణ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. దాసరాజు గురవయ్య పెద్ద కుమార్తె అనంత రావమ్మకు గుడిబండకు చెందిన ఆత్కూరి రాధాకృష్ణతో 24 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి గోపాలకృష్ణ పుట్టిన తరువాత విడిపోయారు. అనంత రావమ్మ గోపాలపురం వచ్చి తల్లిగారి ఇంట్లో ఉంటూ హుజూర్‌నగర్‌లో ఇళ్లల్లో దుస్తులు ఉతుకుతూ జీవనం సాగిస్తోంది. గోపాలకృష్ణ (22) చెడు వ్యసనాలకు బానిసై తాగొచ్చి తరచూ తల్లిని ఇబ్బందులకు గురి చేస్తుండే వాడు. వ్యసనాలను మాన్పించేందుకు ఆసుపత్రుల్లో చూపిస్తున్నారు. తల్లి, పిన్నితో గొడవ పడి బుధవారం వారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టి గేటు వేసుకున్నాడు. చాలా సేపటి వరకు గేట్ తీయక పోవడంతో ఎదురింటి వారు గోడపై నుంచి చూడగా చీరతో ఉరి వేసుకొని కనిపించాడు. కొందరు యువకులు వెళ్లి ఉరి తప్పించి హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గోపాలకృష్ణ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత బలవన్మరణం
కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కొండమల్లేపల్లి మండలం సాగర్‌రోడ్డులో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి బంధువులు, పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక సాగర్‌రోడ్డులో రమావత్ హతీరాం-పద్మ దంపతులు నివాసముంటున్నారు. ఏడాదిన్నర క్రితం వారి కుమారుడు జగన్‌కు దామరచర్లకు చెందిన అంజలితో వివాహమైంది. వీరికి నాలుగు నెలల పాప ఉంది. కొంతకాలంగా అత్తమామలకు, ఈమెకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం భర్త పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు. అంజలి తన నాలుగు నెలల పాపను పక్కనే ఉండే ఆడపడుచు వద్ద ఉంచి, తాము ఉండే గదిలోకి వెళ్లింది. సాయంత్రం వరకు బయటికి రాకపోవడంతో అత్త గదిలోకి వెళ్లి చూడగా ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. వెంటనే వారు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం బయటికి రాకుండా చూశారు. చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురువారం వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి దస్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వీరబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్యయోగం ఎంతమందికో..?
[ 07-12-2023]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంత మందికి అమాత్యయోగం దక్కనుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. -
మరిన్ని నీళ్లు పోశాం.. మంచి ఫలాలివ్వాలి మరి!
[ 07-12-2023]
మీరు మొక్కలు నాటారు. ఆ మొక్కలకు మాతో నీళ్ల పోయించారు. అవి బాగా ఎదిగి చెట్లయ్యాయి. కొత్త పంట కాలం వచ్చింది కదా. మాకూ బాగా ఫలాలివ్వాలి’ -
ఇక పంచాయతీల్లో ఎన్నికల పండగ..!
[ 07-12-2023]
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అశోక్‌కుమార్ జిల్లా కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లాలో 3.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
[ 07-12-2023]
నల్గొండ జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే వరకు అధికారులు సరైన ఏర్పాట్లు చేశారు. -
రైతుల ఖాతాల్లో రూ. 598 కోట్లు జమ
[ 07-12-2023]
జిల్లాలో 191 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్డీవో చెన్నయ్య, డీఎస్వో వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. -
రెవెన్యూ డివిజన్ కల సాకారమయ్యేనా..?
[ 07-12-2023]
ఆలేరు పరిసర ప్రాంతాల ప్రజలు దశాబ్దాల కాలంగా పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది. -
కొలాబ్‌తో కార్యాలయ పని సులభతరం: కలెక్టర్
[ 07-12-2023]
కొలాబ్ఫైల్స్ ఎన్ఐసీ వెబ్ అప్లికేషన్ ప్రభుత్వ కార్యాలయాలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. -
యాదాద్రిలో పంచనారసింహుల ఆరాధనలు
[ 07-12-2023]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో కార్తిక మాసం నాలుగో బుధవారం నిత్య ఆరాధనలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. శ్రీ స్వామి, అమ్మవార్ల కల్యాణం, సుదర్శన హోమాది పర్వాలతో పాటు అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. -
విన్నపాలు విన్నారు.. పరిష్కరించారు
[ 07-12-2023]
సూర్యాపేట నియోజకవర్గంలోని ఉండ్రుగొండ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ఆస్తులకు పార్టీల గుర్తులు వేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా కరపత్రాలు విద్యుత్తు స్తంభాలకు అతికిస్తున్నారని ఫిర్యాదు అందింది. -
ధాన్యం ఆరబోత.. తప్పని అవస్థ
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తడిసిన ధాన్యం ఆరబోసుకుంటూ.. మళ్లీ వర్షం కురిస్తే దగ్గరికి చేసుకుంటూ నానాఅవస్థలు పడుతున్నారు. -
పార్టీలు మారి.. విజేతగా నిలిచి
[ 07-12-2023]
రాజకీయ నాయకుల లక్ష్యాల్లో ఒకటి ప్రజాప్రతినిధిగా ఎంపికవడం. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగినా.. పదవులు దక్కకుంటే మరో పార్టీలోకి వెళ్లడం సహజం. -
వారూ ఓటేశారు..!
[ 07-12-2023]
-
పరీక్ష నెగ్గితే ఉపకార వేతనం
[ 07-12-2023]
ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు చదువును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరిట పరీక్ష నిర్వహిస్తూ అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఐదేళ్ల పాటు ఉపకార వేతనం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. -
అర్హత కాదు.. అవకాశాలు ముఖ్యం
[ 07-12-2023]
‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..నిజం మరిచి నిదుర పోకుమా...’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఉన్నత చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా, -
నేతన్నల్లో చిగురిస్తున్న ఆశలు
[ 07-12-2023]
చేనేత, మరమగ్గాల, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి పదేళ్లవుతుంది. ఈ సంఘాల పదవీకాలం అయిదేళ్లే. -
ధరావత్తు దక్కకపోయినా .. మళ్లీ పోటీ
[ 07-12-2023]
ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఉన్న ఆర్థిక బలం వారికి ఉండదు. అయినా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. కనీసం ధరావత్తు దక్కించుకునే ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి వారిది.