logo

కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి

స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి పట్టణంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాళులర్పించారు.

Published : 27 Sep 2023 15:42 IST

భువనగిరి: స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి పట్టణంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడారు. స్వాతంత్ర్యోద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చురుకుగా పాల్గొని జైలుకెళ్లారని తెలిపారు. తెలంగాణ కోసం తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని వదులుకున్న మహనీయుడన్నారు. రెండు పర్యాయాలు భువనగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి, చేనేత రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని