logo
Published : 02/12/2021 04:40 IST

వీఎస్‌యూని అగ్రగామిగా నిలుపుదాం: వీసీ


హాస్టల్‌ విద్యార్థినులతో ముచ్చటిస్తున్న వీసీ సుందరవల్లి

వెంకటాచలం, న్యూస్‌టుడే: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ సహకారం అందించాలని వీఎస్‌యూ ఉపకులపతి సుందరవల్లి కోరారు. బుధవారం వీఎస్‌యూ అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వీఎస్‌యూ అభివృద్ధికి తీసుకోనున్న చర్యలు, లక్ష్యాలను వివరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి న్యాక్‌ గుర్తింపుతో పాటు, పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రతి అధ్యాపకుడు కృషి చేయాలన్నారు. సమయపాలన పాటించడంతోపాటు విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. విద్యార్థిని, విద్యార్థుల వసతి గృహాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ చంద్రయ్య, రిజిస్ట్రార్‌ ఎల్వీ కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్‌ సుజా ఎస్‌ నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని