logo
Published : 02/12/2021 04:40 IST

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన


పోలీసు కవాతు మైదానంలో సూచనలు చేస్తున్న ఎస్పీ విజయరావు

నెల్లూరు(నేర విభాగం, కలెక్టరేట్‌, గ్రామీణం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల మూడో తేదీ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. సీఎం పర్యటన ఆద్యంతం సజావుగా సాగేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పోలీసు కవాతు మైదానంలోని హెలీప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేస్తుండగా- బుధవారం సాయంత్రం సీఎం పర్యటించే ప్రాంతాలను కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ సీహెచ్‌ విజయరావు పరిశీలించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. ఐఎస్‌డబ్ల్యూ(ఇంటెలిజెన్స్‌ సెక్యురిటీ వింగ్‌) ఎస్పీ వకుల్‌ జిందాల్‌ బుధవారం జిల్లాకు వచ్చారు. ఎస్పీతో సమావేశమై భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎస్పీ సీహెచ్‌ విజయరావు నేతృత్వంలో ఇద్దరు అదనపు ఎస్పీలతో పాటు 1500కుపైగా పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. గురువారం నుంచి సిబ్బంది సీఎం పర్యటించే ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకోనున్నారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని