logo
Published : 02 Dec 2021 04:40 IST

గస్తీ.. నాస్తి!

మూలకు చేరిన హైస్పీడ్‌ బోట్లు


మరమ్మతులకు నోచుకోని బోటు

సముద్ర తీరంలో చొరబాట్లు.. ఉగ్రదాడులు.. ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కేటాయించిన గస్తీ బోట్లు మూలకు చేరాయి. సిబ్బంది లేమికి తోడు.. ఏళ్లుగా ఇవి మూలకు చేరడం ఇబ్బందికరంగా మారింది. తీరంలో మెరైన్‌ సేవలపై ప్రభావం చూపుతోంది.

కృష్ణపట్నంపోర్టు(ముత్తుకూరు), న్యూస్‌టుడే జిల్లాలో కావలి నుంచి తడ వరకు ఉన్న తీర ప్రాంతంలో.. సముద్రంలో సుమారు 12 నాటికల్‌ మైళ్ల దూరంలో గస్తీకి ఏడేళ్ల కిందట మూడు ‘హై స్పీడ్‌’ బోట్లను కేటాయించారు. ఒక్కొక్కటి రూ. 1.10 కోట్ల విలువ చేసే వీటిని మెరైన్‌శాఖకు అప్పగించగా- లంగరు వేసేందుకు అనుకూలంగా ఉంటుందని కృష్ణపట్నం పోర్టు వద్ద ఉంచారు. నాటి నుంచి.. అవి మరమ్మతులకు గురైనప్పుడు కోల్‌కతా నుంచి సాంకేతిక నిపుణులు వచ్చి బాగు చేసేవారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అనంతర క్రమంలో బోట్లకు పెట్రోల్‌ భారం కావడం.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో రెండేళ్ల నుంచి వాటిని అలాగే వదిలేశారు. ఆరు నెలల కిందట ఒక దాని ఇంజిన్‌ పూర్తిగా చెడిపోగా- ఒడ్డుకు తెచ్చి కృష్ణపట్నం పోలీసు స్టేషన్‌ వద్దకు చేర్చారు. మరో రెండింటిని పోర్టు దక్షిణం వైపు లంగర్‌ వేశారు.

దృష్టిసారిస్తేనే...

కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇచ్చిన బోట్ల నిర్వహణ.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన అనంతరం గస్తీ అరకొరగా సాగింది. ప్రస్తుతం బోట్లను మూలకు చేరాయి. దీంతో నిరంతరం ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్న పోర్టులో కోస్ట్‌గార్డు సిబ్బంది గస్తీపైనే ఆధారపడాల్సి వస్తోంది. గతంలో శ్రీలంకకు చెందిన రెండు బోట్లు.. అక్రమంగా చేపల వేట సాగిస్తున్నప్పుడు మెరైన్‌ సిబ్బంది.. ప్రైవేటు బోట్లలో వెళ్లి పట్టుకున్నారు. తీరంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించారు. త్వరితంగా మరమ్మతులు చేయిస్తే.. భద్రతా వర్గాల హెచ్చరికలు వచ్చినప్పుడు.. సిబ్బంది తక్షణం స్పందించేందుకు అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

ఉన్నతాధికారులకు నివేదించాం

- పీవీ నారాయణ, మెరైన్‌ సీఐ

గస్తీ బోట్లకు మరమ్మతులు అవసరమై.. ఉన్నతాధికారులకు నివేదించాం. రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేక పరిస్థితుల్లో అవసరం మేరకు.. సిబ్బంది ఇతర బోట్లలో వెళ్లి పరిశీలిస్తున్నారు. పై స్థాయి అధికారుల నిర్ణయం మేరకు గస్తీని చేపడుతున్నాం. సిబ్బంది కూడా తక్కువగానే ఉన్నారు. 43 మందికి గాను ఆరుగురు కానిస్టేబుళ్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని