logo
Published : 02/12/2021 04:40 IST

ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి


సీతారామపురం : గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న ఈఈ నరసింహం

ఉదయగిరి, న్యూస్‌టుడే: జగనన్న శాశ్వత గృహ హక్కు (ఓటీఎస్‌) లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని గృహ నిర్మాణశాఖ ఈఈ నరసింహం అన్నారు. మండంలోని తిరుమలాపురం, దుంపవారిపల్లి, శకునాలపల్లి, ఉదయగిరి ఎస్టీ కాలనీలో బుధవారం ఆయన లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. నగదు చెల్లించినవారికి రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేశారు. కావలి డివిజన్‌లో 60 వేల మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. నగదు చెల్లించిన లబ్దిదారులు సంపూర్ణ గృహ హక్కు పత్రాలు పొందడం వలన క్రయ విక్రయాలు చేసుకోవడంతోపాటు రుణాలు పొందే అవకాశం ఉందన్నారు

సీతారామపురం: ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కార్యక్రమాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని గృహనిర్మాణశాఖ ఈఈ నరసింహం కోరారు. మండలంలోని సీతారామపురం, సింగారెడ్డిపల్లిలో ఓటీఎస్‌ పథకం గురించి గురువారం అవగాహన కల్పించారు. పొదుపు సంఘాల్లోని సభ్యులు గ్రూపులోని సొమ్ముతో రుణం తీసుకొని ఓటీఎస్‌ పథకానికి రుణం చెల్లించవచ్చన్నారు.

దగదర్తి: ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న గృహ హక్కు పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని గృహ నిర్మాణ శాఖ డీఈ వరప్రసాద్‌ కోరారు. ఆయన మండలంలోని ఊచగుంటపాళెంలో బుధవారం పర్యటించి ఓటీఎస్‌ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కావలి గ్రామీణం: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వినియోగించుకోవాలని గృహనిర్మాణశాఖ డీఈ వరప్రసాద్‌ తెలిపారు. మండల పరిధిలోని రుద్రకోటలో బుధవారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై గ్రామ సచివాలయం సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రుద్రకోట పంచాయతీ నత్తనడకన సాగుతుందన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని