logo
Published : 02/12/2021 04:40 IST

విద్యార్థుల్లో అభ్యసన స్థాయి పెంచాలి: ఆర్జేడీ

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : విద్యార్థుల్లో అభ్యసన స్థాయి పెంచాలని ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వీఎస్‌ సుబ్బారావు ఆదేశించారు. బుధవారం నగరంలోని కస్తూరిదేవి విద్యాలయంలో జిల్లా ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు-నేడు కార్యక్రమంలో పాఠశాలల్లో వసతులు సమకూరాయని, నాణ్యమైన విద్యను అందించి జిల్లాను ముందంజలో ఉంచాలని నిర్దేశించారు. సీీబీఎస్‌ఈ పద్ద్ధతిలో బోధనలు చేపట్టి వార్షిక పరీక్షలకే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో పి.రమేష్‌, నెల్లూరు ఉపవిద్యాశాఖాధికారి రఘురామయ్య పాల్గొన్నారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని