logo
Published : 02/12/2021 04:40 IST

ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: జేసీ

మాట్లాడుతున్న జేసీ గణేష్‌కుమార్‌, వేదికపై డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి తదితరులు

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే : ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జేసీ గణేష్‌కుమార్‌ సూచించారు. నెల్లూరు పురమందిరంలో మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధితుల పట్ల నిరాదరణ చూపవద్దని తెలిపారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌ నియంత్రణాధికారి డాక్టర్‌ రమాదేవి మాట్లాడుతూ హెచ్‌ఐవీ నియంత్రణలో జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచిందని, యువత సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. వ్యాధి నియంత్రణలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, డీటీసీవో వెంకటప్రసాద్‌, మలేరియాధికారి మనోరమ, డాక్టర్‌ పవిత్ర, డెమో శ్రీనివాసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నర్సింగ్‌ విద్యార్థినులు పాల్గొన్నారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని