logo
Published : 02/12/2021 04:40 IST

గండి పూడ్చివేత


నీరు వృథా కాకుండా బస్తాలు వేస్తున్న గ్రామస్థులు

కలిగిరి, న్యూస్‌టుడే: మండలంలోని రావులకొల్లు చెరువు అలుగు నుంచి వృథా పోతున్న నీటిని గ్రామస్థులు శ్రమదానంతో బుధవారం ఇసుక బస్తాలు వేసి అడ్డుకున్నారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు రావులకొల్లు చెరువు అలుగు పాడై గండి పడింది. వృథాపోతున్న నీటిని అడ్డుకునేందుకు బస్తాలు సమకూర్చాలని రైతులు అధికారులను కోరారు. ప్రభుత్వం నుంచి బస్తాలు రావడం లేదని, ఎఫ్‌డీఆర్‌ కింద మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతామని అధికారులు తెలిపారు. అప్పట్లోగా నీరు బయటకు పోతుందని భావించిన స్థానికులు శ్రమదానంతో నీటిని ఆపాలని భావించారు. రావులకొల్లు గ్రామస్థులకు సమీపంలోని ఏపినాపి వాసులు సహకరించారు. సర్పంచులు పి.వెంగపనాయుడు, పి.వరప్రసాద్‌ల ఆధ్వర్యాన రెండు పంచాయతీల ప్రజలు, రైతులు కలిసి చెరువు వద్దకెళ్లారు. 500 పైగా బస్తాలకు ఇసుకను నింపి అలుగు ప్రాంతంలో అడ్డుగా వేశారు. చెరువులోని నీరు వృథా పోకుండా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. రైతుల ఆలోచన సత్ఫలితాన్ని ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చెరువు అలుగుకు శాశ్వత మరమ్మతులు జరిపించాలని ప్రజలు అధికారులను కోరారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని