logo
Updated : 03/12/2021 06:38 IST

సచివాలయ మహిళా పోలీస్‌ ఆత్మహత్య

సీతారామపురం, న్యూస్‌టుడే : కుటుంబ కలహాలతో పెళ్లైన మూడు నెలలకే ఉరేసుకుని మహిళా పోలీస్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అయ్యవారిపల్లి గౌతమ్‌నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండరాజు, రమాదేవి దంపతుల కుమార్తె జ్యోతి శ్రీవిద్య (31) సీతారామపురం-2 సచివాలయంలో మహిళా పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె చెల్లలు సంగీత కూడా అదేసచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. రోజులాగే గురువారం శ్రీవిద్య విధులకు హాజరైంది. మధ్యాహ్నం ఇంటికివెళ్లిన ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబీకులు 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి వింజమూరు మండలంలోని ఊటుకూరు వీఆర్‌ఏగా పనిచేస్తున్న ప్రకాష్‌రావుతో మూడునెలల క్రితమే వివాహమైంది. కుటుంబకలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని