logo

AP News: ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ఆర్థిక సమస్యలు ఆ ఉద్యోగిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే అయినా ఊహించిన రీతిలో పలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో గురువారం కావలి పట్టణంలోని వెంగళరావునగర్‌లో నివాసం ఉంటున్న గన్నేరువరం ఫణికుమార్‌(31) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 21 Jan 2022 08:13 IST


ఫణికుమార్‌ 

కావలి, న్యూస్‌టుడే: ఆర్థిక సమస్యలు ఆ ఉద్యోగిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే అయినా ఊహించిన రీతిలో పలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో గురువారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వెంగళరావునగర్‌లో నివాసం ఉంటున్న గన్నేరువరం ఫణికుమార్‌(31) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య, బంధువులు చెబుతున్న వివరాల మేరకు.. మృతుని భార్య ఉషారాణి కలిగిరి మండలం గుడ్లదొన గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయుల కలెక్టరేట్‌ ముట్టడి ఎక్కడికక్కడ నివారించేందుకు కలిగిరి ఎస్సై ఆదేశంతో ఉదయం ఏడున్నరకే భార్య ఇంటి నుంచి విధులకు వెళ్లింది. భర్త ఉరేసుకునే సమయంలో ఇంట్లో నాలుగేళ్లు, రెండేళ్ల వయసున్న కుమారులున్నారు. తండ్రిని పిలుస్తుంటే పలకడం లేదని ఏడుస్తుండటంతో పక్కింటి వారు గమనించగా అప్పటికే ఫణికుమార్‌ విగతజీవిగా మారాడు. ఈయన ప్రకాశం జిల్లా పెదపవని పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వివాహమైంది. కావలి పట్టణంలో నివాసముంటూ దంపతులు ఉద్యోగాలకు వెళ్లొస్తున్నారు. ఫణికుమార్‌ 21 ఏళ్ల వయసులోనే పోస్టల్‌శాఖలో కొలువు సాధించాడు. దీంతో పాటు వివిధ వ్యాపారాలు చేసి నష్టపోయాడు. పలుచోట్ల అప్పులు చేయడంతో కుటుంబ పోషణ కష్టతరమైంది. మానసికంగా ఇబ్బందులు పడుతూ పలు పర్యాయాలు వైద్యుల ద్వారా చికిత్స పొందారు. అప్పులు ఎలా తీర్చాలనే బెంగతోనే ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం తెలియగానే కావలి రెండో పట్టణ సీఐ మల్లికార్జున్‌ సంఘటనా స్థలికి చేరుకొని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని