logo

‘ప్రభుత్వ తీరుతో మానసిక క్షోభ’

రాష్ట్ర ప్రభుత్వ అమానుష వైఖరితో తామంతా తీవ్రంగా మనస్తాపం చెందుతున్నట్టు ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల కక్షసాధింపు ధోరణి ఏమాత్రం సరికాదన్నారు. ఆదివారం కావలిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ

Published : 24 Jan 2022 06:12 IST


కావలిలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సంఘీభావంగా ఉద్యోగ సంఘాల ఐకాస

కావలి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ అమానుష వైఖరితో తామంతా తీవ్రంగా మనస్తాపం చెందుతున్నట్టు ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల కక్షసాధింపు ధోరణి ఏమాత్రం సరికాదన్నారు. ఆదివారం కావలిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అద్దె భత్యం తగ్గింపు అనేది అనైతికమన్నారు. గతంతో పోలిస్తే ఎక్కడైనా ప్రస్తుతం అద్దెలు తగ్గాయా లేక పెరిగాయా అనేది అందరికీ తెలిసిందన్నారు. ఎన్నికలకు ముందు అనేక వాగ్ధానాలు ఇచ్చారని, వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తామని నమ్మించారన్నారు. ఇప్పుడేమో సాధ్యం కాదంటుందన్నారని తప్పుబట్టారు. భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేశామని, ప్రభుత్వంపై నిరసన చేపడుతున్నట్లు వివరించారు. గెజిటెడ్‌ ఉద్యోగ సంఘ నాయకులు శ్రీనివాసులు, ఎన్‌జివోల సంఘ కావలి తాలుకా అధ్యక్షులు శివకుమార్‌, ఫ్యాఫ్టో నాయకులు మధు, రెవెన్యూ సర్వీసెస్‌ సంఘ నాయకులు నరసారెడ్డి, పంచాయతీరాజ్‌ నుంచి దీక్షితులు, ఆర్టీసి తరఫున రఘునాధరెడ్డి, తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని