logo

‘రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు’

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని కోడూరుపాడులో కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్‌ ఆనం విజయకుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల నడుమ వాగ్వాదం చోటుచోసుకుని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో

Published : 24 Jan 2022 06:12 IST


అనధికారిక లేఅవుట్‌ను పరిశీలిస్తున్న విజయకుమార్‌రెడ్డి తదితరులు

నెల్లూరు(గ్రామీణం), న్యూస్‌టుడే: నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని కోడూరుపాడులో కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్‌ ఆనం విజయకుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల నడుమ వాగ్వాదం చోటుచోసుకుని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనధికారిక లేఅవుట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ధ్వజమెత్తారు. కోడూరుపాడు ఏటి పొర్లుకట్ట భూమిని ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్నట్లు గ్రామస్థులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేదిలేదనీ, ఈ విషయంపై కలెక్టర్‌, రెవెన్యూ అధికారులతో చర్చించి న్యాయం కోసం పోరాడుతానని గ్రామస్థులకు తెలియజేశారు. ఏటికట్ట ప్రభుత్వ భూమిలో అనుమతుల్లేకుండా లేఅవుట్లు వేయడం సరికాదనీ, ప్రజలకు ఉపయోగపడే పనులు ఉంటే ప్రభుత్వ అనుమతితో భూమిని వినియోగించుకోవచ్చన్నారు. ఒక లేఅవుట్‌లో దాదాపు 18ఎకరాల పైగా భూములు ఆక్రమణ విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందనీ, అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్లాట్లు కొన్నవారు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆక్రమణలకు పాల్పడుతున్నవారు అధికార పార్టీ చెబుతున్నారనీ, వైకాపాకు చెడు పేరు తేవొద్దన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని