logo

వసతిగృహాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటయ్య అన్నారు. ఉదయగిరిలోని బీసీ బాలుర, ఇంటిగ్రేటేడ్‌ బాలికల వసతిగృహాలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా దస్త్రాలను పరిశీలించడంతో పాటు వసతిగృహాల

Published : 24 Jan 2022 06:12 IST


వసతిగృహాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటయ్య

ఉదయగిరి, న్యూస్‌టుడే : జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటయ్య అన్నారు. ఉదయగిరిలోని బీసీ బాలుర, ఇంటిగ్రేటేడ్‌ బాలికల వసతిగృహాలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా దస్త్రాలను పరిశీలించడంతో పాటు వసతిగృహాల పరిసరాలను తనిఖీచేసి విద్యార్థులు, వసతిగృహా సంక్షేమాధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 99 బీసీ వసతిగృహాలుండగా 77 వసతిగృహాలకు విద్యార్థులకు వచ్చారన్నారు. మిగిలిన వాటిలోకి విద్యార్థులు వచ్చేలా సంక్షేమాధికారులచే విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెస్‌ బిల్లులతోపాటు విద్యార్థులకు చెల్లించాల్సిన కాస్మోటిక్‌ ఛార్జీలను డిసెంబరు దాకా పెండింగ్‌ లేకుండా చేశామని వివరించారు. అలాగే వసతిగృహాల గదుల్లోకి దోమలు రాకుండా జిల్లా కలెక్టరుతో మాట్లాడి ప్రత్యేక నిధులతో మెస్‌లు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాడు- నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు వసతిగృహాలను కూడా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం సీతారామపురం, అయ్యవారిపల్లి వసతిగృహాలను సందర్శించారు. కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమాధికారి బాషుసాహెబ్‌, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని