logo

ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకం

ప్రభుత్వం ప్రకటించిన అశాస్త్రీయ పీఆర్సీలోని జీవోలకు వ్యతిరేకంగా, కోల్పోయిన రాయితీలు తిరిగి సాధించుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని పీఆర్సీ సాధన సమతి జిల్లా ఛైర్మన్లు మన్నేపల్లి పెంచలరావు, అల్లంపాటి పెంచలరెడ్డి, ఏనుగ రమ

Published : 28 Jan 2022 01:17 IST


రిలే దీక్షలో ఉద్యోగులు

 

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : ప్రభుత్వం ప్రకటించిన అశాస్త్రీయ పీఆర్సీలోని జీవోలకు వ్యతిరేకంగా, కోల్పోయిన రాయితీలు తిరిగి సాధించుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని పీఆర్సీ సాధన సమతి జిల్లా ఛైర్మన్లు మన్నేపల్లి పెంచలరావు, అల్లంపాటి పెంచలరెడ్డి, ఏనుగ రమణారెడ్డి, చేజర్ల సుధాకర్‌రావు స్పష్టం చేశారు. దశల వారీ ఆందోళనల్లో భాగంగా గురువారం కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ పీఆర్సీలోని అంశాలు ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి సమ్మెలోకి వెళతామన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో ఛైర్మన్‌ మురళీధర్‌, వివిధ సంఘాల నాయకులు వెంకటస్వామి, చెంచురామయ్య, మల్లికార్జున, డి.రమణారెడ్డి, రవీంద్రబాబు, విజయకుమార్‌, జె.వెంకటేశ్వర్లు, వీవీ శేషులు, కిరణ్‌కుమార్‌, ఎ.సురేంద్రరెడ్డి, ఎన్‌.దశరథరాములు, సీహెచ్‌వీ సుబ్బారెడ్డి, రాజమనోహర్‌, గిరిధర్‌, రాజగోపాలచార్యులు, మధుసూదన్‌ నారాయణరావు, లక్ష్మీనారాయణ, స్వర్ణలత, చిన్నమ్మ, సౌందర్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని