logo

వసతులు లేకుండా నిర్మాణాలెలా..

తమకు సరైన వసతులు కల్పించకుండా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఇబ్బంది పెట్టడం సరికాదని జగనన్న గృహ లబ్ధిదారులు జేసీ హరేంధిర ప్రసాద్‌ ఎదుట వాపోయారు. వెంకటగిరిలోని జగనన్న లేఅవుట్‌ వద్ద జేసీ గురువారం లబ్ధిదారులతో

Published : 28 Jan 2022 01:17 IST

సమస్యలు ఏకరవు పెట్టిన లబ్ధిదారుల


లబ్ధిదారులతో మాట్లాడుతున్న జేసీ హరేంధిర ప్రసాద్‌

వెంకటగిరి, న్యూస్‌టుడే: తమకు సరైన వసతులు కల్పించకుండా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఇబ్బంది పెట్టడం సరికాదని జగనన్న గృహ లబ్ధిదారులు జేసీ హరేంధిర ప్రసాద్‌ ఎదుట వాపోయారు. వెంకటగిరిలోని జగనన్న లేఅవుట్‌ వద్ద జేసీ గురువారం లబ్ధిదారులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పలువురు లబ్ధిదారులు నీటి వసతి, విద్యుత్తు సౌకర్యం లేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. గుంతలు తీస్తే.. సమీప చెరువు ఊట నీరు వస్తుండటం ఇబ్బందిగా ఉందని కొందరు, కట్టిన ఇంటికి బిల్లులు చెల్లించడం లేదని మరికొందరు.. ఇసుక లభ్యత లేదని ఇంకొందరు సమస్యలు ఏకరవు పెట్టారు. తొలుత మౌలిక వసతులు కల్పించాలని, రాత్రి వేళ వాచ్‌మెన్‌ ఉండేలా చూడాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 1.80 లక్షల నగదు సరిపోవడం లేదని, రూ. 40 వేలు అదనంగా చెల్లిస్తే నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పిన ప్రైవేటు గుత్తేదారులు ఇంత వరకు రాలేదన్నారు. నగదు చెల్లించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే.. ఇల్లు కట్టుకుంటే సరే.. లేకుంటే పట్టా రద్దు చేస్తామంటూ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఫోన్లు చేసి భయపెడుతున్నారని జేసీకి వివరించారు. అందుకు జేసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమస్యపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని